సీబీఐను లోక్పాల్ పరిధిలోకి వస్తే చిదంబరం జైలుకే
Published on: Wed Dec 21, 2011 12:43PM
ఢిల్లీ: అన్నా
హజారే తన మాటల తూటాలను పేల్చడం ఆరంభించారు. కోరలు లేని పాములాంటి లోక్పాల్ బిల్లు పార్లమెంటు టేబుల్ పైకి రాబోతోందనీ, అసలు లోక్పాల్ పరిధిలోకి సీబీఐని తీసుక రాకపోతే అవినీతి నాయకులు తప్పించుకునేందుకు పెద్ద మార్గం ఉన్నట్లేనని ఆయన అభిప్రాయపడ్డారు.సీబీఐను కనుక లోక్పాల్ పరిధిలోకి తీసుకవస్తే తక్షణం కేంద్ర హోంమంత్రి చిదంబరం జైలు ఊచలు లెక్కించాల్సి వస్తుందని అన్నా హజారే చెప్పుకొచ్చారు. అవినీతిని అణచలేని అటువంటి బిల్లు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అన్నారు.
తాము సూచించినట్లు బలమైన జన్ లోక్పాల్ బిల్లును ప్రభుత్వం ఆమోదిస్తే సరి లేదంటే 27 నుంచి యధావిధిగా దీక్ష మొదలుపెడతానని అన్నా హజారే హెచ్చరించారు. ప్రజలు కోరుకునే వాటిని నెరవేర్చేందుకే ప్రభుత్వాలు ఉండాలి కానీ, ప్రభుత్వాలు చెప్పేది ప్రజలు వినాలనడం అసహజమని హజారే అన్నారు.


