TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ప్రచారం చేయబోం :అన్నా బృందం

Published on: Wed Jan 11, 2012 3:38PM

న్యూఢిల్లీ:త్వరలో జరుగున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ప్రచారం చేయబోమని అన్నా హజారే బృందం సభ్యులు ప్రకటించారు. పది రోజుల చికిత్స అనంతరం ఇంటికి చేరుకున్న హజారేతో బృందం సభ్యులు అరవింద్ కేజ్రీవాల్,ప్రశాంత్ భూషణ్‌లు బుధవారం సమావేశమయ్యారు.అనంతరం వారిద్దరు మాట్లాడుతూ... వచ్చే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఏ ఒక్క రాజకీయ పార్టీకి వ్యతిరేకంగా తాము ప్రచారం చేయరాదని ఎందుకంటే.. ఆయన ఆరోగ్యం కుదుట పడిన తర్వాతే దీనిపై చర్చించి ఓ నిర్ణయం తీసుకుంటామన్నారు.