హాలీవుడ్ కంటే యాప్స్ మార్కెట్టే ఎక్కువ...

 

సినిమా రంగంలో హాలీవుడ్‌ది అగ్రపీఠం. హాలీవుడ్‌లో రూపొందే భారీ సినిమాలు ప్రపంచ వ్యాప్తంగా విడుదలై కలెక్షన్లను కొల్లగొడుతూ వుంటాయి. సినిమాలది పెద్ద తెర.. కలెక్షన్లు కూడా ఆ స్థాయిలోనే భారీగా వుంటాయి. మరి యాప్స్ విషయం.. చిన్న కంప్యూటర్ల తెరల మీద, అంతకంటే చిన్నవైన సెల్ ఫోన్ తెరల మీద కనిపిస్తూ వుంటాయి. సాధారణంగా అయితే హాలీవుడ్‌తో యాప్స్‌ని పోల్చడానికి ఎవరూ ఇష్టపడరు. హాలీవుడ్ కంటే యాప్స్ స్థాయి చాలా చిన్నదని అనుకుంటారు. అయితే వాస్తవాలు మాత్రం ఇందుకు విరుద్ధంగా వున్నాయి. 2014 సంవత్సరంలో హాలీవుడ్ సాధించిన మార్కెట్ వాల్యూ కంటే యాప్స్ సాధించిన మార్కెట్ వాల్యూనే ఎక్కువగా వుంది. హాలీవుడ్ కంటే యాప్స్ 10 బిలయన్ డాలర్ల ఎక్కువ ఆదాయాన్ని సంపాదించి సంచలనం సృష్టించింది. యాంగ్రీ బర్డ్ లాంటి గేమ్స్, ఫేస్‌బుక్ మొబైల్ వెర్షన్లు కొన్ని హాలీవుడ్ సినిమాల కంటే ఎక్కువ డబ్బును సంపాదించాయి.