Latest News

‘అనేకుడు’ ట్రైలర్ అదరహో...

posted on: Feb 11, 2015 2:00PM

 

ధనుష్ నటించిన ‘అనేకుడు’ సినిమా ట్రైలర్ విడుదలైంది. ‘రంగం’ లాంటి అద్భుతమైన సినిమాను రూపొందించిన కె.వి.ఆనంద్ ఈ సినిమా దర్శకుడు. ధనుష్ నటించిన ‘రఘువరన్ బీటెక్’ సినిమా ఈమధ్య తెలుగులోకి అనువాదమై విజయం సాధించింది. అలాగే మొన్ననే హిందీలో ‘షమితాబ్’ ఘన విజయం సాధించింది. ఈ నేపథ్యంలో తమిళంలో ‘అనేకన్’ పేరుతో, తెలుగులో ‘అనేకుడు’ పేరుతో ఈ సినిమా విడుదలవుతోంది. ‘అనేకుడు’ ట్రైలర్ చూస్తుంటే లవ్, యాక్షన్ కలసిన థ్రిల్లర్‌లా ఈ సినిమా అనిపిస్తోంది. ట్రైలర్ చాలా బాగుంది.. మీరూ చూడండి..

 

 

google-ad-img
    Related Sigment News
    • Loading...