TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

రాష్ట్రవ్యాప్తంగా పెరిగిన ఇసుక ధరలు

Published on: Wed Mar 28, 2012 10:39AM

ఈ నెలాఖరు నుంచి రాష్ట్రంలోని అన్ని ఇసుక రీచ్ లలో తవ్వకాలు నిలిపివేయాలని హైకోర్టు ఆదేశించడంతో ఇసుక ధరలు అమాంతం పెరిగాయి. దీంతో సొంత ఇల్లు కట్టుకోవాలన్న బడుగు జీవులు ఇబ్బందులకు గురవుతున్నారు. రాష్ట్రంలోని దాదాపు అన్ని జిల్లాల్లో ఇసుక మాఫియాలు రాజకీయ అండదండలతో, అధికారుల సహాయ సహకారాలతో ప్రకృతి ప్రసాదించిన ఇసుకను దోచుకుంటున్నారు. వీరి దోపిడీవల్ల పర్యావరణంతో పాటు భూగర్భ జలాలకు కూడా ముప్పు ఏర్పడింది. ఈ విషయాన్ని గమనించిన హైకోర్టు తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకు ఈ నెలాఖరు నుంచి ఇసుక తవ్వకాలు నిలిపివేయాలని ఆదేశించింది. దీంతో ఇసుక ధరలు తారాస్థాయికి చేరుకున్నాయి. గతంలో మూడు క్యూబిక్ మీటర్లు వుండే లారీ ఇసుక రూ.2000లకు లభించేది.

 

ఇప్పుడు అది రూ.5000 వేలకు పెరిగింది. నెలాఖరు తరువాత ఇసుక తవ్వకాలు నిలిచిపోతే లారీ ఇసుక రూ.10వేలకు పెరిగినా ఆశ్చర్యపోనక్కర్లేదని తెలిసింది. ఇసుక కాంట్రాక్టర్లు భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఇప్పటిదాకా తవ్విన ఇసుకనంతా పలుచోట్ల నిలువచేశారు. ఇసుక తవ్వకాలు నిలిచిపోయిన తరువాత ఈ ఇసుకను అధిక రేట్లకు విక్రయించి డబ్బు దండుకావాలన్నది వీరి వ్యూహం. ప్రభుత్వంగాని, కోర్టులుగాని ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నా ఇసుక మాఫియా ముఠాలు వాటిని తమకు అనుకూలంగా మలుచుకోగలరనడానికి ఇదొక ఉదాహరణ.