TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

జగన్ హయాంలో అప్పుల కుప్ప.. బాబు పాలనలో అభివృద్ధిలో అగ్రగామి

Published on: Tue Jul 29, 2025 1:05PM

వైసీపీ హయాంలో   తెలుగుదేశం కూటమి ప్రభుత్వం  అప్పులకుప్పలా మారిన రాష్ట్రాన్ని అభివృద్ధి అభివృద్ధిలో అగ్రగామిగా తీర్చిదిద్దుతున్నామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు.  సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఆయన మంగళవారం (జులై 29) శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం కంభంపాడులో  పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత జగన్ ప్రభుత్వం తమ చేతిలో అప్పుల పత్రాలు  పెట్టి వెళ్లిందనీ, అటువంటి రాష్ట్రంలో అభివృద్ధి పనులకు ఆటంకం లేకుండా అభివృద్ధి చేస్తున్నామని అన్నారు.  అంతకు ముందు   కోటి తీర్థం గ్రామంలో ప్రముఖ శైవ క్షేత్రాన్ని దర్శించున్న ఆనం మూడు కోట్ల నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులను ప్రారంభించారు.. జల జీవన్ మిషన్ ద్వారా మంచి నీటి పథకాలకు శంకుస్థాపన,  ప్రభుత్వ పాఠశాలల అదనపు తరగతి గదులు, పశువైద్యశాల ప్రారంభోత్సవం చేశారు.  అలాగే  సిమెంట్ రోడ్లను ప్రారంభించారు.  సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం లో భాగంగా గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వ పథకాల గురించి వివరించారు.

ఏడాది పాలనలో చంద్రబాబు  ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి పనులు చేసిందన్నారు. అటువంటి సుపరిపాలన అందిస్తున్న తెలుగుదేశం కూటమి ప్రభభుత్వానికి అండగా నిలవాలని ప్రజలను కోరారు.  ఆ తరువాత తూర్పు ఖమ్మంపాడు గ్రామంలో జరిగిన   సభలో మంత్రి ఆనం ప్రసంగించారు. నియోజకవర్గంలో ప్రతి పనిని చేపడుతున్నామని ప్రజల అవసరాలను తెలుసుకుంటూ వారి సమస్యలను తీరుస్తున్నామని అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ తమ ప్రభుత్వం ముందుకు వెళుతుందని అన్నారు.