TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

స్వతంత్ర సంస్థగా ఏపీ డ్రోన్ కార్పొరేషన్

Published on: Thu Apr 3, 2025 3:45PM

ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అధ్యక్షతన జరిగింది. ఈ కేబినెట్ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించి ఆమోదించారు. ఏపీ డ్రోన్ కార్పొరేషన్ ను స్వతంత్ర సం్థగా ఏర్పాటు చేసేందుకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. ఇప్పటి వరకూ ఏపీ ఫైబర్ నెట్ లో భాగంగా ఉన్న డ్రోన్ కార్పొరేషన్ ను ఇక నుంచి ఏపీ డ్రోన్ కార్పొరేషన్ గా స్వతంత్ర సంస్థగా ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. అలాగే అనకాపల్లి జిల్లా డీఎల్ పురం వద్ద క్యాపిటివ్ పోర్టు ఏర్పాటుకూ కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇక పోతే యువజన, పర్యాటక శాఖ జీవోలక రాటిఫికేషన్ కు మంత్రివర్గం ఆమెదం తెలిపింది. అలాగే 710 కోట్ల రూపాయల హడ్కో రుణానికి ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. 

ఇక మీడియా అక్రిడిటేషన్ నిబంధనలు-2025కు, నాగార్జున సాగర్ లెఫ్ట్ బ్రాంచ్ కెనాల్ రిటైలింగ్ వాల్ నిర్మాణ ప్రతిపాదనకు కూడా కేబినెట్ ఆమోదముద్ర వేసింది. అలాగే జలహారతి కార్పొరేషన్  ఏర్పాటుకు, దాని ద్వారా పోలవరం, బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టుపై కేబినెట్ చర్చించి ఆమోదించింది.  అదే విధంగా  త్రీ స్టార్, ఆ పైబడిన హోటళ్లకు బార్ లైసెన్స్ ఫీజును పాతిక లక్షలకు కుదిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది.