TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

ఏపీ కొత్త గవర్నర్‌గా సుష్మాస్వరాజ్!!

Published on: Mon Jun 10, 2019 1:28PM

 

వ్యక్తిగత కారణాలతో ఎన్నికల్లో పోటీ చెయ్యకుండా దూరంగా ఉండిపోయారు మాజీ విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్.  విదేశాంగ మంత్రిగా తన బాధ్యతల్ని చక్కగా నిర్వర్తించారు. ఐక్యరాజ్యసమితిలో భారత వాణి వినిపించడంలో ఆమె చురుకైన పాత్ర పోషించారు.  ఆమె రెండోసారి మోదీ ప్రభుత్వంలో లేకపోవడం అందర్నీ ఆశ్చర్యపరించింది.  

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్‌గా నరసింహన్ కొనసాగుతున్నారు. ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన సందర్భంగా అక్కడ కొత్త గవర్నర్‌ను నియమించే అంశాన్ని కేంద్రం పరిశీలిస్తోంది. ఆ పదవికి సుష్మస్వరాజ్ అయితే చక్కగా సెట్ అవుతారని బీజేపీ హైకమాండ్ భావిస్తున్నట్లు సమాచారం.

ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం పట్ల బీజేపీ పాజిటివ్‌గా ఉన్నప్పటికీ మున్ముందు నిధుల కేటాయింపులు, ప్రాజెక్టుల విషయంలో ఏపీ ప్రభుత్వం మొండి పట్టుదలకు వెళ్లే అవకాశం ఉందనీ, అలాంటి సమయంలో ఆ ప్రభుత్వాన్ని కంట్రోల్‌లో పెట్టేందుకు ప్రత్యేకంగా గవర్నర్ ఉండాలనే ఆలోచనలో బీజేపీ ఉన్నట్లు తెలుస్తోంది. అన్నీ అనుకున్నట్లే జరిగితే త్వరలోనే సుష్మస్వరాజ్ ఏపీలో గవర్నర్‌గా అడుగుపెట్టే అవకాశాలున్నాయి.