విద్యార్ధులకు ఆకులు అలమలే గతి
Published on: Thu Oct 4, 2012 1:14PM
.png)
ఆంధ్రాయూనివర్సిటీలోని విద్యార్దులు ఆకస్మిక ఆందోళన చేపట్టారు. పెంచిన మెస్ చార్జీలను వెంటనే తగ్గించాలని వారు ఆందోళన చేస్తున్నారు. ఎప్పుడు ఆందోళనలకు దూరంగా వుండే సైన్సు విద్యార్ధులు కూడా ఇందులో పాల్గోన్నారు. గ్యాసు, డీజిల్ చార్జీలు పెరిగాయని మెస్ బిల్లులను అమాంతం పెంచేయటం తమకు ఇబ్బంది కరంగా వుందని అలాగే హాస్టల్స్‌లో సౌకర్యాలు కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయని వెలగని ట్యూబ్‌లైట్లు,మంచినీరు, అలాగే భోజన వసతులు ఏమాత్రం బాగుండలేదని వారు ఆరోపిస్తున్నారు. దానికి నిరసనగా విద్యార్ధులు ఆకులు అలములు తింటూ వారి నిరసనను వ్యక్తం చేస్తున్నారు. యూనివర్సిటీకి పూర్తి స్ధాయి వైస్ చాన్సలర్ లేనందువల్ల ప్రస్తుతం ఉన్న వారికే తమ డిమాండ్లను వివరిస్తామన్నారు. బుధవారం భోజనం చేయకుండా వారు రోడ్ల మీదనే బైటాయించి నిరసనను వ్యక్తం చేస్తున్నారు.


