TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ప్రభుత్వ జాప్యంతో ఆంధ్రా అక్నూ మధ్య ఫీజుల పోరు?

Published on: Mon Jul 2, 2012 5:38PM

ఉభయగోదావరి జిల్లాల్లోని 240కళాశాలలను అక్నూ(ఆదికవినన్నయ్య యూనివర్సిటీ) పరిథిలోకి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీన్ని ఉన్నత విద్యాశాఖ పూర్తిస్థాయిలో అమలు చేయలేదు. కనీసం పెద్దగా జోక్యం కూడా చేసుకోవటం లేదు. ఈ రెండు జిల్లాల్లో 500 కోట్ల రూపాయల ఆస్తులున్న ఆంథ్రాయూనివర్సిటీ కూడా ఆ కళాశాలలను వదులుకోవటానికి ఇష్టపడటం లేదు. ఎందుకంటే 350కళాశాలలు ఆంథ్రాయూనివర్సిటీ అనుబంధంగా నడుస్తున్నాయి. వీటిలో 240 కళాశాలలను వదులుకుంటే ఆస్తులను కూడా ధారదత్తం చేయాల్సి వస్తుందని ఆంథ్రాయూనివర్సిటీ భావిస్తోంది. అందుకని ప్రభుత్వం స్పష్టంగా ఆదేశించినా ఆ 240కళాశాలలను ఫీజులు తమకే చెల్లించాలని కోరింది. ఈ నెల 15వతేదీలోపు వాటిని అందజేయాలని ఆదేశించింది. అక్నూ కూడా తమ పరిథిలోని కళాశాలలను ఈ నెల 15వతేదీలోపు ఫీజులు చెల్లించాలని కోరింది. దీంతో కళాశాలల యాజమాన్యాలు తలపట్టుకుని కూర్చున్నాయి. ఒకవైపు ప్రభుత్వఆదేశాలు, మరోవైపు ఆంథ్రా యూనివర్సిటీతో తమ కళాశాలకు ఉన్న అనుబంధం యాజమాన్యానికి తలనొప్పి తెప్పిస్తోంది. రెండున్నర లక్షల మంది విద్యార్థుల భవితవ్యంతో ప్రభుత్వం ఆటలాడుకుంటోందని యాజమాన్యాలు ఆందోళన చెందుతున్నాయి. తమ ఆదేశాలను కొనసాగిస్తూ మరో రిమైండర్‌ను ప్రభుత్వం పంపటం ద్వారా ఆంథ్రాయూనివర్సిటీని కట్టడి చేయాలని విద్యా రంగ సీనియర్లు కోరుతున్నారు. ఇటు కళాశాలలను, అటు అక్నూను ఆంథ్రాయూనివర్సిటీ దోషిగా చూస్తే దానికి ప్రభుత్వమే కారణమవుతుందని  వారు స్పష్టం చేస్తున్నారు. ఏమైనా ప్రభుత్వం జాప్యం చేయకుండా ఈ రెండు యూనివర్సిటీల తగవు తీర్చాలని పలువురు కోరుతున్నారు.