TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

పాలక మండళ్ళ రద్దుపై పిటిషన్ తిరస్కృతి

Published on: Tue Sep 23, 2014 12:37PM

 

ఆంధ్రప్రదేశ్‌లోని ఆలయాల పాలక మండళ్ళను రద్దు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ని హైకోర్టు మంగళవారం తిరస్కరించింది. ఆలయ ట్రస్టు భూములను కాపాడేందుకే ఆర్డినెన్స్ను చట్టరూపంలోకి తెచ్చామన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వాదనతో హైకోర్టు ఏకీభవించింది. దేవాలయ పాలక మండళ్లను రద్దు చేసే అదికారం ప్రభుత్వానికి ఉందని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. న్యాయస్థానం తీర్పుతో కొత్త పాలక మండళ్లు ఏర్పాటు కావడానికి మార్గం సుగమం అయింది.