TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

గవర్నర్‌ నరసింహన్ ఢిల్లీ టూర్

Published on: Mon Sep 15, 2014 9:04AM

 

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ సోమవారం ఉదయం ఢిల్లీ బయల్దేరి వెళ్లారు. ఢిల్లీలో ఆయన ఒకరోజు పర్యటిస్తారు. ఆయన సోమవారం నాడు పలువురు కేంద్ర మంత్రులతో పాటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో భేటీ అవుతారు. ఈ పర్యటనలో ఆయన రెండు రాష్ట్రాల సమస్యలపై చర్చించనున్నట్లు సమాచారం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు గవర్నర్ను కలిసిన కొద్దిరోజులకే నరసింహన్ ఢిల్లీ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.