ఆంద్రప్రదేశ్ ను గజగజలాడిస్తున్న చలిపులి
Published on: Mon Jan 16, 2012 12:48PM
హైదరాబాద్:ఉత్తరాది ప్రభావంతో రాష్ట్రంలోరాయలసీమ,కోస్తాంధ్ర,తెలంగాణ ప్రాంతాలన్నింటిలోకొద్ది రోజులుగా చల్ల గాలులు వీస్తున్నాయి. ఉష్ణోగ్రతలు పడిపోయి ప్రజలు చలిపులికి గజగజ వణుకుతున్నారు.ఈ చల్లగాలుల ప్రభావం రాష్టంలో మరో రెండు రోజులు కొనసాగుతాయని వాతావరణ పరిశోధనా కార్యాలయం అధికారులు చెబుతున్నారు.విశాఖ ఎజెన్సీ చలిదెబ్బకు విలవిల్లాడుతోంది.లంబసింగిలో ఉష్ణోగ్రత పడిపోయింది. ప్రధాన నగరాలలోనూ చలితీవ్రత పెరిగింది.రామగుండంలో అత్యల్పంగా 8 డిగ్రీల నమోదైంది. హైదరాబాద్ లో 10 డిగ్రీలు, కళింగపట్నం, నిజామాబాద్,రెంటచింతలలో 11, విశాఖపట్నం లో 12 డిగ్రీలు, విజయవాడ, బాపట్ల, తునిలో 13 డిగ్రీలు గా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వయో వృద్ధులు ఈ చలిగాలుల బారిన పడకుండా జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు.ఆదిలాబాదు జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో 4 డిగ్రీల కన్నా తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ చలి కాలంలో అత్యంత కనిష్ట ష్ణోగ్రతలు ఇవే.


