టెన్త్ పరీక్షల నిర్వహణకు కొత్త రూల్స్!
Published on: Tue May 5, 2020 10:53AM
పదవ తరగతి పరీక్షల నిర్వహణా షెడ్యూల్ని ఏపీ ప్రభుత్వం సిద్ధం చేస్తోంది. లాక్ డౌన్ క్రమక్రమంగా ఎత్తి వేస్తున్న తరుణంలో పదవతరగతి పరీక్షలు నిర్వహించేందుకు విద్యాశాఖ కసరత్తులు చేస్తోంది. సామాజిక దూరం పాటిస్తూనే పదవ తరగతి విద్యార్థులకు పరీక్ష నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఒక పరీక్ష హాలులో కేవలం 12 మంది విద్యార్థులు మాత్రమే కూర్చొని పరీక్షలు రాసే విధంగా ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి విద్యార్థికి మధ్య ఆరు అడుగుల దూరం ఉండడంతో పాటు ప్రతి బెంచ్ కి ఒక్క విద్యార్థి మాత్రమే కూర్చునేలా విద్యాశాఖ కొత్త రూల్స్ తో మార్గదర్శకాలు తయారు చేసింది.
కరోనా వైరస్ నేపథ్యంలో లాక్ డౌన్ కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎప్పుడో జరగాల్సిన పదో తరగతి పరీక్షలు ఇప్పటికీ జరగకుండానే ఉన్నాయి. వైరస్ ప్రభావం తీవ్రంగా పెరిగిపోవడంతో పరీక్షలను వాయిదా వేయక తప్పలేదు.


