రేపే ఏపీ రాజధాని ప్రకటన
Published on: Wed Sep 3, 2014 6:28AM
.jpg)
ఆంధ్రప్రదేశ్ ప్రజలు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న కొత్త రాజధాని ఎక్కడన్న సస్పెన్స్ రేపు దశమి రోజున వీడిపోనుంది. ముందుగా అనుకున్న ప్రకారం అయితే మంగళవారం నాడే వీడిపోవాల్సి వుంది. అయితే మంచి ముహూర్తం కోసం గురువారానికి వాయిదా వేశారు. పైగా తండ్రి వర్ధంతి కార్యక్రమం కోసం ప్రతిపక్ష నాయకుడు జగన్ ఇడుపులపాయకి వెళ్ళారు. ఆయన లేకుండా ప్రకటించడం భావ్యం కాదని కూడా వాయిదా వేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం నాడుశాసనసభలో దీనిపై అధికారిక ప్రకటన చేయనున్నారు. విజయవాడ-గుంటూరు మధ్యే ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏర్పాటు చేయాలని మంత్రివర్గ సమావేశంలో తీర్మానించిన విషయం తెలిసిందే.


