TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

రాజధాని విషయంలో గందరగోళం లేదు.. మంత్రి..

Published on: Thu Aug 28, 2014 11:15AM

 

ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని ఏర్పాటు ఎక్కడ అనే విషయంలో ఎలాంటి గందరగోళం లేదని వ్యవసాయశాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు అన్నారు. శివరామకృష్ణన్ కమిటీ నివేదిక ఇచ్చిన నేపథ్యంలో ఆయన రాజధాని గురించి మాట్లాడారు. రాజధాని విషయంలో ముఖ్యమంత్రి పూర్తి స్పష్టతతో వున్నారని, అందువల్ల నూతన రాజధాని ఏర్పాటుపై విభిన్న ప్రకటనలు చేయొద్దని పుల్లారావు తోటి మంత్రులకు సూచించారు. రాజధానిపై ఏర్పాటైన శివరామకృష్ణన్ కమిటీ రిపోర్ట్ గురించి ప్రధాని నరేంద్ర మోడీ, సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు చూసుకుంటారని పుల్లారావు వెల్లడించారు.