షిరిడీలో మంత్రి నారా లోకేష్ దంపతులకు ఘన స్వాగతం
Published on: Mon Jan 12, 2026 2:03AM

ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ సతీ సమేతంగా సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం షిరిడీ చేరుకున్నారు.ఆయన సోమవారం (జనవరి 12) ఉదయం షిరిడీ సాయినాథుని దర్శించుకోనున్నారు. కాగా ఆదివారం (జనవరి 11) షిరిడీ చేరుకున్న లోకేశ్ దంపతులకు విమానాశ్రయంలో కోపర్గావ్ ఎమ్మెల్యే, శ్రీసాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ మాజీ చైర్మన్ అశుతోష్ ఆకాశరావు కాలే, ఆలయ అధికారులు సాదరంగా స్వాగతం పలికారు. మంత్రి వెంట చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని తదితరులు ఉన్నారు. సోమవారం (జనవరి 12) ఉదయం జరిగే కాకడ హారతి సేవలో లోకేశ్, బ్రహ్మణి దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు చేయనున్నారు.


