TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ 19 తేదిన

Published on: Fri Jan 13, 2012 3:25PM

హైదరాబాద్: ఎట్టకేలకు ఈనెల 19న రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారైంది. ఈ మేరకు ప్రభుత్వ వర్గాలు శుక్రవారం పేర్కొన్నాయి. రాజ్‌భవన్‌కు కూడా సమాచారం అందినట్లు తెలియవచ్చింది. ఈ విస్తరణలో చిరంజీవి వర్గానికి చెందిన ఇద్దరికి మంత్రివర్గంలో స్థానం లభించనుంది.ఎమ్మెల్సీ సి రామచంద్రయ్య, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుకు కేబినెట్లో అవకాశం కల్పించినట్లు సమాచారం. కాగా సి .రామచంద్రయ్యకు మంత్రి పదవి ఇవ్వొద్దంటూ, వైఎస్ఆర్ జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు అధిష్టానానికి ఫిర్యాదు కూడా చేశారు.