అసెంబ్లీలో యనమల బడ్జెట్ ప్రతిపాదనలు
Published on: Wed Aug 20, 2014 11:16AM
.jpg)
రాష్ట్ర విభజన తర్వాత రూపొందించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మొట్టమొదటి బడ్జెట్‌కు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదముద్ర వేసింది. ఈ బడ్జెట్‌ను రాష్ట్ర ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు బుధవారం 11 గంటలకు అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఉదయం 8 గంటలకు అసెంబ్లీ కమిటీ హాల్‌లో సమావేశమై బడ్జెట్‌కు రాష్ట్ర కేబినెట్ ఆమోదాన్ని తెలిపింది. అనంతరం బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి యనమల ఉదయం 11 గంటలకు శాసనసభలో ప్రవేశపెట్టారు. సభలో ఆమోదం పొందిన తర్వాత బడ్జెట్ పత్రాలను గవర్నర్ ఆమోదం కోసం పంపుతారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు పదేళ్ళ తర్వాత బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్‌లో గత ఎన్నికల్లో టీడీపీ ఇచ్చిన ఎన్నికల హామీల అమలును దృష్టిలో పెట్టుకుని బడ్జెట్‌ను రూపొందించినట్టు ఆయన తెలిపారు.


