ఒకటి లేదంటే మూడు రాష్ట్రాలు

Publish Date:Jul 6, 2013

 

Andhra Pradesh, telangana issue, royala telangana

 

 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలి. లేకుంటే తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ రాష్ట్రాలుగా విభజించాలి. అంతేకాని రాయలసీమను రెండుగా విభజిస్తే ఇరు ప్రాంతాల ప్రజల మనోభావాలు దెబ్బతింటాయి. రెండు వైపుల నుండి పెద్ద ఎత్తున ఉద్యమం వస్తుంది అని కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, మాజీ కేంద్ర మంత్రి సాయిప్రతాప్ లు కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి దిగ్విజయ్ సింగ్ వివరించారు. తెలంగాణ మీద త్వరలో ఓ నిర్ణయం వస్తుందన్న ప్రచారం, రాయల తెలంగాణ ఏర్పాటు అన్న ఊహాగానాల నేపథ్యంలో వారు తమ వాదనను వినిపించారు.


ఇక హైదరాబాద్ విషయం తేల్చిన తరువాతనే తెలంగాణ ఏర్పాటు గురించి మాట్లాడాలని, లేకుంటే రాష్ట్రం రావణకాష్టంలా మారుతుందని మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి స్ఫష్టం చేసినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ ను కేంద్ర పాలిత ప్రాంతంగా చేసి రాష్ట్రాన్ని విభజిస్తే ఎలాంటి అభ్యంతరం లేదని జేసీ అన్నారు.