ఆదర్శముఖ్యమంత్రి చంద్రబాబు
Published on: Sun Jan 24, 2016 3:46PM

ఆంధ్రప్రదేశ్ సిఎం చంద్రబాబుకు ఆదర్శముఖ్యమంత్రి పురస్కారం దక్కింది.. పుణేలోని భారతీయ ఛాత్ర సంసద్,ఈనెల 30 న ఈ పురస్కారాన్ని ఆయనకు అందించనుంది...పుణె, కొత్రూడ్ లోని మిట్ క్యాంపస్‌లో జరిగే వాలిడెక్టరీ సెర్మనీ సందర్భంగా చంద్రబాబు ఈ అవార్డ్ అందుకుంటారు. దేశవ్యాప్తంగా పదివేలకు పైగా విద్యార్ధి ప్రతినిధులు ఈ కార్యక్రమానికి హాజరౌతారని, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి చంద్రబాబు చేస్తున్న కృషికి, ఈ పురస్కారాన్ని ప్రకటించామని సంసద్ తెలిపింది.
మహారాష్ట్ర శానన మండలి చైర్మన్ రామ రాజే నాయక్ నీంబల్కర్ ఈ అవార్డును అందజేస్తారని, రాష్ట్ర హయ్యర్, టెక్నికల్ ఎడ్యుకేషన్ శాఖ మంత్రి వినోద్ టాడే ఇందులో పాల్గొంటారని సంసద్ ప్రతినిధులు తెలిపారు. గతంలో ఈ అవార్డును మధ్య ప్రదేశ్ సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్‌కు ప్రదానం చేశారు. విద్యార్థి నాయకులతో మాట్లాడేందుకు ఆసియా, పశ్చిమ దేశాలకు చెందిన అన్ని ప్రధాన రాజకీయ పార్టీల నాయకులు ఈ కార్యక్రమానికి హాజరవుతారని సంసద్ చెబుతోంది .


