విజయవాడ పరిసరాల్లోనే రాజధాని.. ఎల్లుండి బాబు ప్రకటన
Published on: Tue Sep 2, 2014 11:09AM
.jpg)
ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎక్కడన్న విషయంలో మంగళవారం నాడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు క్లారిటీ ఇస్తారని, దీనికి సంబంధించి అసెంబ్లీలో ప్రకటన చేస్తారన్న వార్తలు వచ్చాయి. అయితే, రాజధాని ప్రకటనకు సంబంధించిన పత్రాలు సిద్ధంకాకపోవడం, ఈరోజు అష్టమి, పైగా మంగళవారం అన్న పలు కారణాల నేపథ్యంలో ప్రకటనను ఎల్లుండికి వాయిదా వేశారు. విజయవాడ, గుంటూరు మధ్యలోనే ఏపీ రాజధాని ఉంటుందని ఏపీ కేబినెట్ భేటీలో సోమవారం నిర్ణయం తీసుకున్నారు. అలాగే ఏపీ తాత్కాలిక రాజధాని విజయవాడ కేంద్రంగా పలు కార్యాలయాలు ఏర్పాటు చేసేందుకు అన్ని విభాగాల శాఖాధిపతులకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. విజయవాడలో కార్యాలయాల ఏర్పాటుకు ఎంత మేర స్ధలం అవసరమవుతుంనే ప్రతిపాదనలు పంపాలని ఉత్తర్వుల్లో ఆదేశించింది. ఒక మంచి నిర్ణయాన్ని ప్రకటించడానికి మంచిరోజు కోసం ఆగడం మంచిదేగా మరి...


