ఏపీ రాజధాని విజయవాడ..
Published on: Thu Sep 4, 2014 11:37AM
.jpg)
ఆంధ్రప్రదేశ్ రాజధానిగా విజయవాడను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. గురువారంలో ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఆయన ఈ నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించారు. విజయవాడ పరిసర ప్రాంతాల్లోనే ఆంధ్రప్రదేశ్ రాజధాని వుంటుందన్నారు. విజయవాడే రాజధాని అవుతుందని ముందుగానే మంత్రివర్గ నిర్ణయం అందరికీ తెలుసు. ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ నిర్ణయాన్ని అధికారికంగా అసెంబ్లీలో ప్రకటించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నిర్ణయాన్ని ప్రకటించినప్పుడు సభ్యులు హర్షధ్వానాలు చేశారు. ప్రతిపక్ష నేత జగన్ కూడా దీనికి అంగీకారం తెలిపారు.


