ఏపీ కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోనున్న ప్రభుత్వం...

ఏపీ కేబినెట్ సమావేశం ప్రారంభమైంది, కార్పొరేషన్లు, బోర్డుల ఏర్పాటుపై ప్రధానంగా చర్చించనుంది. స్థానిక సంస్ధల ఎన్నికల సమయం దగ్గర పడుతుండడంతో ఎన్నికల నిర్వహణకు ఉన్న సాంకేతిక అడ్డంకులను అధిగమించే దిశగా నిర్ణయాలు తీసుకునే అవకాశముంది. చేనేత కార్మిక కుటుంబాలకు ప్రకటించిన ఆర్థిక సాయానికి ఆమోదం తెలియజేసింది. మరోవైపు మత్స్యకారుల సంక్షేమం విషయంలో మరో నిర్ణయానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది సర్కార్. ఇక డ్వాక్రా మహిళల కోసం వైఎస్సార్ క్రాంతి పథకాన్ని మంత్రి వర్గం ఆమోదం తెలపనుంది. వివాదంగా ఉన్న పోలవరం రాజధాని నిర్మాణం, పీపీఏల వంటి అంశాలపై చర్చ జరిగే అవకాశం కనిపిస్తోంది. మొత్తం పదిహేను అంశాలతో కూడిన అజెండాతో ఏపీ కేబినెట్ సమావేశం అవుతుంది. సీఎం జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలో కేబినెట్ ప్రారంభమైంది. వివిధ సంక్షేమ పథకాలకు సంబంధించిన విధి విధానాలను ఖరారు చేయటంతో పాటుగా గ్రీన్ సిగ్నిల్ ఇచ్చేదిశలో కూడా ఈ కేబినెట్ లో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారు. కాబట్టి దీంట్లో భాగంగా చేనేత కార్మికులకు ఏటా ఇరవై నాలుగు వేల రూపాయలు ఆర్ధికసాయం ఇవ్వాలన్న అంశానికి  సంబంధించిన వ్యవహారాల పథకానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పాటు విధి విధానాలు ఖరారు చేయనున్నారు.

కాబట్టి ఈ పథకాన్ని డిసెంబర్ ఇరవై ఒకటవ తేదీన ప్రారంభించాలని చెప్పి అనుకుంటున్నారు. అలాగే సంక్షేమ కార్పొరేషన్ ల ద్వారా వివిధ వర్గాలకు వాహనాల పంపిణీ, అంటే ఇసుక రవాణాకు సంబంధించి ఆరు వేల వాహనాలను సబ్సీడీ ద్వారా కార్పొరేషన్ ల సాయంతో లబ్ధి దారులకు అంధించాలని చెప్పి ఇప్పటికే నిర్ణయం తీసుకున్న క్రమంలో ఆ వ్యవహారం మీద చర్చించటంతో పాటుగా ఔట్ సోర్సింగ్ కార్పోరేషన్ ని ఏర్పాటుచేయాలని ఇప్పటికే ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేసిన నేపధ్యంలో దానికి ఇవాళ క్యాబినేట్ ఆమోదం తెలపనుంది. మొత్తం ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల్లో యాభై శాతం మేర ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకే ఈ ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు కట్టబెట్టాలన్న నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఒక కార్పొరేషన్ ని,వివిద అంశాలకు సంబంధించి ఏర్పాటు చేయాలని చెప్పి అనుకున్నారు. వాటర్ గ్రిడ్ కు సంబంధించి నలభై ఆరు వేల ఆరు వందల డెబ్బై ఐదు కోట్లతో ఒక పథకాన్ని రూపొందించబోతున్నారు.