ఏపీలో క్యాబినెట్ విస్తరణకు చాన్స్....ప్రక్షాళన తప్పదా..?

ఏపీలో త్వరలో  క్యాబినెట్ విస్తరణ ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో  పాటు  చాలా మార్పులు చేర్పులు కూడా ఉండే అవకాశం కనిపిస్తోంది..జగన్ సీఎం అయ్యాక  క్యాబినెట్ లో తీసుకున్న మంత్రులకు కేవలం రెండున్నరేళ్లు మాత్రమే సమయం ఇచ్చారు...ఆ తర్వాత వారీ పెర్ పార్మెన్స్ ను బట్టి అవసరం అయితే పక్కన పెట్టడం లేదా  ఉంచడం అనే నిర్న‍యం తీసుకుంటాం అని చెప్ప్పారు..కానీ ప్రస్తుతం కొంత మంది మంత్రుల పనితీరుపై  సీఎం సీరియస్ గా  ఉన్నారు..కొంత  మంది పనితీరు నచ్చడం లేదు..దీంతో మార్పులు చేర్పులు  తప్పనిసరిగా  మారింది.

ప్రస్తుతం ఏపీ క్యాబినెట్ నుంచి ఇద్దరు మంత్రులు రాజ్యసభకు ఎన్నికవుతున్నారు..మంత్రులు పిల్లి సుభాష్ చంద్రబోస్ మరో మంత్రి మోపిదేవి వెంకటరమణ..వీరు ప్రస్తుతం  ఎంఎల్సీలుగా ఉన్నారు.మండలి రద్దు నిర్ణయం తీసుకోవడంతో  వీరిని రాజ్యసభకు పంపిస్తున్నారు సీఎం జగన్.....దీంతో వీరి స్థానంలో కొత్త వారికి చాన్స్ ఇచ్చే అవకాశం ఉంది..అయితే వీరి స్థానంలో  ఎవరిని తీసుకుంటారు అనేది ఆసక్తి కరంగా మారింది......సామాజిక వర్గ సమీకరణలో  ఎవరికిమంత్రి పదవులు రావచ్చు అనే చర్చ ప్రస్తుతం నడుస్తోంది.. ఈ నెల 26న రాజ్యసభ ఎన్నికలు జరగనున్నాయి..ఆ తర్వాత   మార్పులు చేర్పులు ఉండచ్చు......స్థానిక సంస్థల ఎన్నికలు కూడా ప్రస్తుతం వాయిదా పడ్డాయి.. దీంతో  సీఎం జగన్ మోహన్ రెడ్డి క్యాబినెట్ విస్తరణపై ద్రుష్టి పెట్టినట్టు సమాచారం..

మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి   రెవిన్యూ శాఖ  ఇవ్వనున్నట్టు సమాచారం.....ఇద్దరు మహిళా మంత్రులపై  కూడా వేటు తప్పదనే  చర్చ జరుగుతోంది..అయితేే   వీరి స్థానంలో కొత్త వారికి అవకాశం కల్పించనున్నారు..మంత్రి  అవంతి శ్రీనివాస్ పనితీరుపై సీఎం సీరియస్ గా ఉన్నట్టు తెలిసింది..  దీంతో  ఆయన శాఖ మారుస్తారా  లేదా ఇంకా సీరియస్ యాక్షన్ తీసుకుంటారా అనే చర్చ జరుగుతోంది.....మహిళా మంత్రుల్లో ఇద్దరి  శాఖలు మారడం మాత్రం ఖాయంగా కనిపిస్తోంది..వైజాగ్ కు సచివాలయం తరలించే లోగా  సీఎం  ఈ నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది...అన్నీ అనుకూలిస్తే ఉగాది తర్వాత ఏపీ క్యాబినెట్ విస్తరణ జరిగే అవకాశాలు  కనిపిస్తున్నాయి.