TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

వాకౌట్ చేశామని సభలోకి వచ్చారు.. యనమల డౌట్...

Published on: Wed Aug 27, 2014 2:20PM

 

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో వైఎస్సార్సీపీ చాలా హడావిడి చేస్తోంది. బుధవారం అసెంబ్లీ సమావేశం కాగానే వైఎస్సార్సీపీ ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని రద్దుచేసి తాము ప్రతిపాదించిన వాయిదా తీర్మానం మీద చర్చ జరపాలని పట్టుపట్టింది. అయితే స్పీకర్ కోడెల శివప్రసాద్ అందుకు తిరస్కరించారు. దానికి నిరసనగా వైఎస్సార్సీపీ నాయకులు అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు. అయితే కాసేపటికి వైఎస్సార్సీపీ సభ్యుడు జ్యోతుల నెహ్రూ వచ్చి సభలో కూర్చున్నారు. వాకౌట్‌ చేసిన సభ్యులు తిరిగి ఎలా వస్తారంటూ మంత్రి యనమల ప్రశ్నించారు. వైసీపీ సభ్యులు అందరూ వెళ్లిపోయాక జ్యోతుల నెహ్రూ ఒక్కరే ఎందుకు కూర్చున్నారని... వారికి నిబంధనలు తెలియవా అని ప్రశ్నించారు. దీనిపై జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ నిరసన తెలిపి వాకౌట్‌ చేసిన మాట వాస్తవమే అని తమ నాయకుడు సహా సభ్యులందరం వాకౌట్‌ చేశామని చెప్పారు. అయితే రుణమాఫీపై వ్యవసాయ మంత్రి ప్రసంగం ముగిసిందని భావించి తాను సభలోకి వచ్చినట్లు జ్యోతుల నెహ్రూ సమర్థించుకున్నారు.