TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

జగన్ పార్టీ హడావిడి.. అసెంబ్లీ వాయిదా

Published on: Mon Aug 18, 2014 1:35PM

 

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సోమవారం ఉదయం ప్రారంభమయ్యాయి. రాష్ట్రంలో క్షీణిస్తున్న శాంతిభద్రతలపై వైసీపీపార్టీ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ కోడెల శివప్రసాద్ తిరస్కరించి ప్రశ్నోతరాలను కార్యక్రమం చేపట్టారు. అయితే వాయిదా తీర్మానం చేపట్టాలంటూ వైసీపీ సభ్యులు సభలో ఆందోళనకు దిగారు. దీంతో సభ పలుమార్లు వాయిదా పడింది. సభ తొలుత పదిహేను నిమిషాలు వాయిదా పడింది. అనంతరం మరో పదిహేను నిమిషాలు వాయిదా పడింది. వైసీపీ సభ్యులు ఆందోళన కొనసాగిస్తూ వుండటంతో సభను మంగళవారానికి వాయిదా వేశారు.