రేపటి ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ వాయిదా
Published on: Sun Mar 12, 2017 1:51PM

నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి మృతికి సంతాపంగా రేపు ఆంధ్రప్రదేశ్ శాసనసభ, మండలికి సెలవు ప్రకటించారు. దీంతో రేపు ప్రవేశపెట్టనున్న బడ్జెట్ వాయిదా పడింది. అయితే బడ్జెట్ ఎప్పుడు ప్రవేశపెట్టేది బీఏసీ సమావేశం నిర్వహించి నిర్ణయం తీసుకోనున్నారు. మంగళవారం ఉదయం శాసనసభ, శాసనమండలిల్లో భూమా మృతికి సంతాపం ప్రకటించినున్నారు..అనంతరం ఉభయసభలు వాయిదా పడతాయి.


