ఏపీఎస్ఆర్‌టిసి: కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ
Published on: Wed Sep 3, 2014 3:58PM
.jpg)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో పనిచేస్తున్న 2327 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉద్యోగ క్రమబద్ధీకరణ పొందిన ఒప్పంద ఉద్యోగులలో 615 మంది కండక్టర్లు, 1712 మంది డ్రైవర్లు వున్నారు. సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి వారి ఉద్యోగాలను క్రమబద్ధీకరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.


