నూతన అసెంబ్లీ భవనాన్ని ప్రారంభించిన చంద్రబాబు
Published on: Thu Mar 2, 2017 11:01AM
.jpg)
నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో మరో చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది..వెలగపూడిలో ఏర్పాటు చేసిన నూతన అసెంబ్లీ భవనాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. ముందుగా నిర్దేశించిన ముహూర్తం ప్రకారం ఉదయం 11.25 నిమిషాలకు సీఎం రిమోట్ ద్వారా శాసనసభ, శాసనమండలి భవన సముదాయలను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు, మండలి ఛైర్మన్ చక్రపాణి, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలతో పాటు రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులు హాజరయ్యారు. వచ్చే నెల 6 నుంచి జరిగే బడ్జెట్ సమావేశాలతో తొలి శాసనసభ సమావేశాలు ప్రారంభం అవుతాయి.


