కాసేపట్లో అసెంబ్లీ భవనాలను ప్రారంభించనున్న చంద్రబాబు
Published on: Thu Mar 2, 2017 9:55AM

నవ్యాంధ్ర రాజధాని అమరావతి ప్రస్థానంలో మరో కీలక ఘట్టం ఇవాళ ఆవిష్కృతం కానుంది. వెలగపూడిలో తాత్కాలిక శాసనసభ, శాసనమండలి భవనాలు అన్ని హంగులతో సిద్ధమయ్యాయి. ఈ భవన సముదాయాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాసేపట్లో ప్రారంభించనున్నారు. రికార్డు సమయంలోనే వెలగపూడిలో ప్రభుత్వ భవనాలు, తాత్కాలిక సచివాలయ భవనాలను ఏపీ సర్కార్ నిర్మించింది. ఈ నెల ఆరు నుంచి నెల రోజుల పాటు జరగనున్న బడ్జెట్ సమావేశాలతో కొత్త శాసనసభ ప్రయాణం మొదలవుతుంది.


