TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

గంగారాజుకు అస్వస్థత, కేర్ లో చికిత్స

Published on: Sat Apr 7, 2012 11:52AM

వివాదాస్పద వ్యాపారవేత్త, ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి గోకరాజు గంగరాజు అస్వస్థతకు గురై హైదరాబాద్ లోని కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. విజయవాడ కేద్రంగా చేసుకుని వ్యాపారాలు, పరిశ్రమలు నిర్వహిస్తున్న గంగరాజు సుమారు రెండు నెలల క్రితం నగరంలోని ప్రశాంత్ యూరాలజీ ఆస్పత్రిలో కిడ్నీస్టోన్స్ కు ఆపరేషన్ చేయించుకున్నారు. ఆయనకు ఏలూరు సమీపంలో వైద్యకళాశాల, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ఉన్నప్పటికీ బైట డాక్టర్లతో చికిత్స చేయించుకోవడం విశేషం. చికిత్స తర్వాత కూడా ఆయనకు స్వస్థత చేకూరకపోవడంతో విజయవాడలోని మరో ఆస్పత్రిలో చేరారు. అయినా ఫలితం లేకపోవడంతో ఆయనను అత్యవసరంగా కేర్ ఆస్పత్రిలో చేర్చారు. ఆయన కుటుంబ సభ్యులు ఈ విషయాలన్నీ గుట్టుగా ఉంచడానికి ప్రయత్నిస్తుండటంతో పలు అనుమానాలకు తావిస్తోంది. కిడ్నీస్టోన్ ఆపరేషన్ జరిగి రెండు నెలలైనా ఆయన ఇంకా ఆస్పత్రిలో చికిత్స పొందుతుండడంతో ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండి ఉంటుందన్న అనుమానాలకు ఆయన సన్నిహితులు వ్యక్తం చేస్తున్నారు.

ఆయనకు గ్యాస్ట్రిక్ ట్రబుల్ తో పాటు, బి.పి. కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన మంతెన సత్యనారాయణ రాజుతో కృష్ణానదీ తీరాన ప్రకృతి వైద్యశాలను ఏర్పాటు చేయించారు. అయితే గంగరాజు తన ఆరోగ్య పరిరక్షణకు ప్రకృతి వైద్య విధానాన్ని ఎప్పుడూ పాటించలేదు. గంగరాజు ఈ వైద్య విధానాన్ని పాటించి ఉంటే ఆయన చాలా ఆరోగ్యంగా ఉండేవారని ఆస్పత్రి వైద్యులు అంటున్నారు. గంగరాజు కొంత కాలంగా పలు సమస్యల తో సతమత మావుతున్నట్లు తెలుస్తోంది. పలు వివాదాల నడుమ ఆయన ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శిగా ఎన్నికయ్యారు.

అయితే ఇప్పుడ క్రికెట్ సంఘం సభ్యులు చీటికి మాటికి ఆయనపై వత్తిడి తెస్తుండటంతో గంగరాజు టెన్షన్ కు గురవుతున్నట్లు తెలుస్తోంది. దీనికి తోడు విజయవాడలో పర్యాటక శాఖ నుంచి లీజుకు తీసుకున్న ప్రైమ్ ల్యాండ్ లో నిర్మిస్తున్న మల్టీఫ్లెక్స్ కూడా వివాదాల్లో పడింది. పెద్ద గుదిబండగా మారిన ఈ మల్టీఫ్లెక్స్ ను సబ్ లీజుకు ఇచ్చి అప్పుల ఊబి నుంచి బైట పదాలని ఆయన ప్రయత్నించారు. అయితే సబ్ లీజ్ కు తీసుకున్న వారు కూడా నిర్మాణాలు చేపట్టలేకపోవడంతో ప్రభుత్వం నుంచి ఆయనపై వత్తిడి పెరిగింది. మరోవైపు ప్రభుత్వం నుంచి తీసుకున్న నిజాం దక్కన్ షుగర్స్ కూడా పెద్ద ఎత్తున నష్టాలను పొందుతుంది. క్రషింగ్ పూర్తయి నెలలు గడుస్తున్నా రైతులకు ఇంకా బిల్లులు చెల్లించకపోవడంతో వారు ఆందోళనలకు దిగుతున్నారు. ఈ టెన్షన్ లతో గంగరాజు ఆరోగ్యం బాగా క్షీణించినట్లు తెలుస్తోంది.