TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

శాసనసభలో గందరగోళ౦...వాయిదా

Published on: Fri Dec 13, 2013 10:04AM

 

 

 

శాసనసభ రెండో రోజు గందరగోళ సన్నివేశాల మధ్య ప్రార౦భమైంది. శాసనసభ ప్రార౦భమైన వెంటనే ఇరుప్రాంతాలకు చెందిన నేతలు సమైక్య ,తెలంగాణ నినాదాలతో స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టారు. ఈ సందర్భంగా సమైక్య తీర్మానం, తెలంగాణ బిల్లు తదితర అంశాలపై ఇచ్చిన వాయిదా తీర్మానాలను తిరస్కరిస్తున్నట్లు స్పీకర్ నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. అసెంబ్లీ సమావేశాలు సజావుగా సాగేందుకు సహకరించాలని స్పీకర్ ఎంతసేపు కోరినా సభ్యులు వినిపించుకోకపోవడంతో సభను అరగంట పాటు వాయిదా వేశారు.