TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ప్రదీప్ వెనుక ప్రముఖ వ్యక్తి... నేను చూసుకుంటా...

Published on: Thu Jan 4, 2018 2:14PM

 

బుల్లి తెరపై అందరూ మహిళా యాంకర్లే రాజ్యమేలుతున్న సమయంలో.. మేల్ యాంకర్ గా అడుగుపెట్టి చాలా తక్కువ సమయంలోనే మంచి పేరు తెచ్చుకున్నాడు ప్రదీప్. ఇప్పటి వరకు ప్రదీప్ పై ఎలాంటి రూమర్లు కానీ... వివాదాలు కానీ లేవు. ప్రస్తుతం మంచి ఫామ్ లో ఉన్న ప్రదీప్ పై తోటి యాంకర్లకు మంచి అభిప్రాయం ఉంది. కానీ పాపం న్యూ ఇయర్ రోజు ఒక్క తప్పు చేసి అడ్డంగా బుక్కయ్యాడు. డిసెంబర్ 31న అర్ధరాత్రి తర్వాత మోతాదుకు మించి మద్యం తాగి పోలీసులకు చిక్కాడు ప్రదీప్. ఇక అంతే మీడియాకు మాంచి న్యూస్ దొరికింది. దొరికింది ఒక్కసారి అయితే.. రోజు మొత్తం ప్రదీప్ ను బద్నాం చేసింది మీడియా. ఒక విధంగా, మీడియా తప్ప.. చాలామంది ప్రదీప్ కు సపోర్ట్ గా నిలిచారు.

 

సోషల్ మీడియాలో అయితే తప్పతాగి దొరికి పోయిన ప్రదీప్ అని, న్యూఇయర్ రోజు తాగి దొరికిపోయిన ప్రదీప్ అని, ప్రదీప్ పక్కన ఉన్నఅమ్మాయిలు ఎవరూ అని, అబ్పో ఎవరికి నచ్చిన టైటిల్స్ వాళ్లు పెట్టుకొని రచ్చ రచ్చ చేశారు. దాని తరువాత...ఇప్పుడు ప్రదీప్ పరిస్థితి ఏంటి... ప్రదీప్ కు జైలు శిక్ష పడుతుందా...? లేక కేవలం ప్రదీప్ కు కౌన్సిలింగ్ మాత్రమే ఇచ్చి పంపిస్తారా..? ఇలా లెక్కకు మించి ప్రశ్నలు వేశారు. అయితే పోలీసులు కౌన్సిలింగ్ కు రావాలని కోరినా ప్రదీప్ ఇంత వరకూ హాజరు కాలేదు. అయితే కేసు నుంచి తప్పించుకునేందుకు అతను జోరుగా ప్రయత్నాలు చేస్తున్నారని అంటున్నారు. అందుకే అజ్ఞాతంలో ఉన్నాడని వార్తలు వస్తున్నాయి.

 

ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే....కేసు నుంచి తప్పిస్తానని ప్రదీప్ కు ఓ ప్రముఖ వ్యక్తి హామీ ఇచ్చినట్లుగా ప్రచారం సాగుతోంది. ఏమీ కాదని, కొన్ని రోజులు మౌనంగా ఉండాలని, ఆ తర్వాత అంతా సర్దుకుంటుందని, బయటపడతావని..ఏం జరగకుండా చూసుకుంటానని సదరు ప్రముఖ వ్యక్తి.. ప్రదీప్‌కు హామీ ఇచ్చారని గాసిప్ రాయుళ్లు పుకార్లు పేలుస్తున్నారు. పోలీస్ స్టేషన్‌కు వెళ్లకుండానే సీజ్ చేసిన కారును తీసుకు వెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారని అంటున్నారు. దీంతో ఇప్పుడు ఆ ప్రముఖ వ్యక్తి ఎవరబ్బా అని చర్చ సాగుతోంది. ఇంతకీ, ప్రదీప్ కు బరోసా ఇచ్చిన ఆ వ్యక్తి ఎవరబ్బా...?