TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

స్మశానాలను కూడా వదలని కబ్జాదారులు

Published on: Thu Mar 1, 2012 12:02PM

అది హిందూపురం కాదు.... కబ్జాల పురం
అనంతపురం జిల్లా : అనంతపురం జిల్లా హిందూపురంలో కబ్జాల పర్వం కొనసాగుతుంది. ప్రతీరోజూ ఎక్కడో ఒకచోట కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ స్థలాలు అక్రమణకు గురవుతున్నాయి. మున్సిపల్ ఆస్తులను కాపాడాల్సిన కౌన్సిల్ సభ్యులు, వారి బంధువులే కబ్జాలకు పాల్పడుతున్నారు. అధికార ప్రతిపక్ష పార్టీల ప్రజాప్రతినిధులు, వారి అనుచరులు స్మశానాలను కూడా వదలడం లేదు. నీటి చెరువులు, మురుగు కాల్వలు, కాలవగట్లు ఇలా ఎక్కడ ఖాళీస్థలం కనిపిస్తే అక్కడ దానిని కబ్జా చేస్తున్నారు. ఈ అక్రమణలకు అడ్డుకట్టు వేయాల్సిన అధికారులు మామూళ్ళకు లొంగి చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు. పట్టణ పరిధిలోకి పొట్నూరు చెరువు, సూరప్ప కుంట చెరువు, శ్రీకంఠపురం  చెరువుల అక్రమణలపై లోకాయుక్త స్పందించేవరకు స్థానిక అధికారులలో చలనం లేకుండా పోయిందంటే ఇక్కడ పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. బాలాజీ టాకీస్ రోడ్డులోని అంబేద్కర్ నగర్ కు చెందిన స్మశానవాటికను కొందరు వ్యక్తులు ఆక్రమించిఏకంగా దుకాణ సముదాయాన్ని నిర్మించారు. ధనలక్ష్మీరోడ్డు, కంసాలిపేట, మెయిన్ రోడ్డు, బెంగుళూరురోడ్డులలో నిర్మించిన ట్యాంకులు, ఆక్రమణదారుల పరమయ్యాయి. పట్టణంలో మెజారిటీ ఆక్రమణలు అమ్మకాల కోసమో, బాడుగల కోసమో జరుగుతున్నాయి. ఒకటి కాదు, రెండుకాదు వేలసంఖ్యలో ఖాళీ స్థలాలు దురాక్రమణకు గురయ్యాయి. దీనిపై అటు మున్సిపల్ అధికారులుగానీ, ఇటు రెవెన్యూ అధికారులుగాని పట్టించుకోవడం లేదు.