TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

గల్ఫ్ కు రోడ్డు మెటల్ గా అనంతపురం ఐరన్ ఓర్

Published on: Mon Mar 12, 2012 1:00PM

గాలి అక్రమాల్లో కొత్త కోణం

తెలుగువన్.కామ్ ప్రత్యేక కథనం

అనంతపురం:    గాలి జనార్దనరెడ్డి అంతూ పంతూ లేకుండా రాష్ట్ర సహజ వనరులకు దోచుకున్నాడు. కడపలో ఉక్కు కర్మాగారం పెడతానంటూ ముందస్తుగానే అనంతపురం గనుల్లో లక్షలాది టన్నుల ఐరన్ ఓర్ ను తవ్వి చైనా, మలేషియా వంటి దేశాలకు విక్రయించుకున్నాడు. ఇదంతా ఒక ఎత్తయితే ఈ అమూల్యమైన ఖనిజ సంపదను గల్ఫ్ లోని కొన్ని దేశాలకు రోడ్లు వేసేందుకు మెటల్ గా విక్రయించాడు. ఐరన్ ఓర్ లోని నాసికరం ఖనిజాన్ని దిగుమతి చేసుకోవడానికి చైనా నిరాకరించిది. అయితే అప్పటికే ఈ నాసికరం ఉక్కు లక్షలాది టన్నుల మేరకు తవ్వి ఉంచారు. అపారంగా పెరిగిపోయిన ఈ నిల్వలను ఏదోకరంగా విక్రయించి ఎంతో కొంత డబ్బు సంపాదించాలనే తపనతో రాష్ట్రంలో ఐదు బినామీ కంపెనీలను నెలకొల్పి వాటిలో రెండు కంపెనీలకు ఈ నాసిరకం ఐరన్ ఓర్ ను అమ్మినట్లుగా రికార్డుల్లో చూపాడు.


అనంతరం ఈ రెండు కంపెనీలు గల్ఫ్ లోని యునైటెడ్ అరబ్ ఎమిరెట్స్, ఓమన్ తో ఒప్ప,ఒప్పందాలు చేసుకున్నాయి. అక్కడ రోడ్లు వేయడానికి కావలసిన మెటల్ కు బదులుగా నాసిరకం ఐరన్ ఓర్ ను అక్కడకు ఎగుమతి చేసి కోట్లాది రూపాయలు దోచుకున్నారు. ఈ ఐరన్ ఓర్ అంతా మొదట రైలుమార్గం ద్వారా కాకినాడ చేరి అక్కడనుంచి గుట్టుచప్పుడు కాకుండా నౌకల ద్వారా గల్ఫ్ దేశాలకు ఎగుమతి అయింది. ఇలా వేలాది టన్నుల ఐరన్ ఓర్ గల్ఫ్ దేశాలకు రోడ్లు వేయడానికి ఉపయోగపడింది. ఈ భాగోతం గాలి జనార్ధనరెడ్డి అరెస్ట్ కావడానికి ముందువరకు నిరాటంకంగా జరుగుతూనే ఉంది. జనార్ధనరెడ్డి అరెస్ట్ అనంతరమే ఈ ఎగుమతులు ఆగిపోయాయి. ఉక్కు తయారీకి ఉపయోగించవలసిన రాష్ట్ర ఖనిజం ఇతరదేశాల్లో రోడ్లు వేయడానికి కంకరగా ఉపయోగించినప్పటికీ మన రాష్ట్ర పాలకులెవరూ కళ్ళు తెరవకపోవడం అత్యంత శోచనీయం.