TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

'అనంత'లో పరిశ్రమ ఏర్పాటుచేయనున్న జగపతిబాబు

Published on: Tue Feb 28, 2012 3:52PM

అనంతపురం : ప్రముఖ సినీ నటుడు జగపతిబాబు అనంతపురం జిల్లాలో పెద్ద వ్యవసాయ ఆధార పరిశ్రమ నెలకొల్పాలని యోచిస్తున్నట్లు తెలిసింది. ఈ ఉద్దేశ్యంతో ఆయన కొద్దిరోజుల క్రితం అనంతపురం జిల్లాలో పర్యటించి సంబంధిత శాఖ అధికారులతో పాటు జిల్లా కలెక్టర్ దుర్గాదాస్ తో కూడా చర్చలు జరిపారు. మంత్రి రఘవీరారెడ్డితోపాటు ఆయన రెవెన్యూ భవన్ లో జరిగిన ఒక అధికారిక సమావేశానికి కూడా హాజరయ్యారు. అనంతపురం జిల్లాలో కరవు పరిస్థితులు అధ్యయనం చేసి లాభసాటి వ్యవసాయం దిశగా జిల్లా రైతాంగాన్ని తీసుకువెళ్ళే ప్రయత్నంలో భాగంగా అయ్యప్పన్ సంస్థ ఇటీవల జిల్లాలో ఒక సమావేశాన్ని నిర్వహించింది. ఈ సమావేశంలో కూడా హీరో జగపతిబాబు ఓపిగ్గా నాలుగు గంటలపాటు కూర్చున్నారు. వ్యవసాయ కుటుంబంలో పుట్టిన తనకు రైతుల స్థితిగతులు ఏవిధంగా ఉంటాయో తెలుసుకుని ఈ సందర్భంగా జగపతిబాబు మీడియాతో మాట్లాడుతూ వ్యాఖ్యానించారు.