TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

బోరుగడ్డ అనిల్ కు బెయిలు మంజూరు.. పోలీసుల నిర్లక్ష్యమే కారణం!

Published on: Sun May 4, 2025 8:28AM

వైసీపీ నేత నేత బోరుగడ్డ అనిల్ కుమార్ కు అనంతపురం జిల్లా కోర్టు శనివారం ( మే3) బెయలు మంజూరు చేసింది.  ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్, ఉపముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లపై దూషణలు, అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ బోరుగడ్డ అనిల్ కుమార్ పై అనంతపురంలో కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ కేసులో ఆయనకు శనివారం బెయిలు మంజూరైంది. 90 రోజులకు పైగా రిమాండ్ ఖైదీగా ఉన్న బోరుగడ్డ అనిల్ పై ఇంత వరకూ చార్జిషీట్ దాఖలు చేయకుండా అనంతపురం పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించడమే బెయిలు మంజూరు కావడానికి కారణం. ఈ విషయాన్ని కోర్టు తన తీర్పు లో స్పష్టంగా పేర్కొంది.  

వైసీపీ  హయాంలో బోరుగడ్డ అనిల్  తెలుగుదేశం, జనసేన నేతలపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేష్ లను అసభ్య పదజాలంతో దూషించారు.  దీనిపై కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత తెలుగుదేశం నేతలు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు మేరకు పోలీసులు బోరుగడ్డ అనిల్ ను అరెస్టు చేశారు. 
కాగా గతంలో కూడా ఓ సారి హైకోర్టు బోరుగడ్డ అనిల్ కు బెయిలు మంజూరు చేసింది. అప్పట్లో బెయిలుపై విడుదలైన ఆయన ఆ తరువాత అజ్ణాతంలోకి వెళ్లిపోయారు. ఆ తరువాత తల్లికి అనారోగ్యం అంటూ నకిలీ సర్టిఫికెట్ సమర్పించి బోరుగడ్డ అనిల్ బెయిలు పొందినట్లు తేలడంతో హైకోర్టు ఆయన ను తక్షణమే లొంగిపోవాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. దీంతో బోరుగడ్డ అనిల్ అప్పట్లో బోరుగడ్డ అనిల్ కోర్టు విధించిన గడువులోగా రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో లొంగిపోయారు. ఇప్పుడు మళ్లీ ఆయనకు బెయిలు మంజూరైంది. అయితే పోలీసులు చార్జిషీట్ దాఖలు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన కారణంగానే అయినకు బెయిలు మంజూరైంది. దీనిపై తెలుగుదేశం శ్రేణులు అనంతపురం పోలీసుల తీరు పట్ల తీవ్ర ఆగ్రహం, అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.