TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

సత్యసాయి సూపర్ స్పెషాలిటీకి విద్యుత్ షాక్

Published on: Wed Feb 29, 2012 11:09AM

అనంతపురం: అనంతపురం జిల్లాలోని పుట్టపర్తిలో ఉన్న సత్యసాయి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కి ప్రభుత్వం విద్యుత్ ఛార్జీల రూపంలో షాకిచ్చింది. ఉచిత వైద్యసేవలు అందజేస్తున్నందుకు రాష్ట్ర ప్రభుత్వం గత పదేళ్లుగా ఈ ఆసుపత్రికి రాయితీ ధరలకు విద్యుత్ సరఫరా చేస్తూ వచ్చింది. యూనిట్ కు రూ.4 చొప్పున చెల్లించాల్సి ఉండగా, ఇందులో ప్రభుత్వ వాటాగా రూ.3.70, ఆసుపత్రి వాటాగా 30 పైసలు చెల్లిస్తున్నారు. అయితే హఠాత్తుగా ప్రభుత్వ వైఖరిలో మార్పువచ్చింది. ఈ ఆసుపత్రికి రాయితీ ఇచ్చేది లేదని స్పష్టం చేసింది. అంతేకాక 2008 నుంచి ఆసుపత్రి వాడుకున్న కరెంటుకు యూనిట్ కు రూ.4 చొప్పున చెల్లించాలంటూ తాకీదులు పంపింది. దీంతో సత్యసాయి సూపర్ స్పెషాలిటి ఆసుపత్రి విద్యుత్ శాఖకు సుమారు నాలుగున్నర కోట్ల రూపాయలు చెల్లించాల్సి వస్తోంది. నిజానికి రెండు నెలల క్రితమే ప్రభుత్వం రాయితీలు ఎత్తివేస్తూ జీవో తీసుకువచ్చింది. అప్పట్లో సత్యసాయి ట్రస్ట్, పుట్టపర్తి ప్రజలు ఆందోళనలు చేయడంతో ప్రభుత్వం అ నిర్ణయాన్ని ఉపసహరించుకుంది. తాజాగా మళ్ళీ రాయితీలు ఎత్తివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.