TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

కాంగ్రెస్ కు ముప్పు తప్పదన్న జేసీ

Published on: Thu Feb 9, 2012 9:52AM

అనంతపురం: రాష్ట్ర కేబినెట్‌లో తనకు చోటు దక్కకపోవడానికి జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులు అడ్డు కోవడం కారణం కాదని, అయినా తనను వాళ్లేం చేస్తారని అనంతపురం జిల్లా తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ దివాకర్‌రెడ్డి వ్యాఖ్యానించారు. అధిష్ఠానం అంగీకరిస్తే పదవులు అవే వస్తాయన్నారు. ఎన్నికల నాటికి కాంగ్రెస్ పార్టీలోని గ్రూపులన్నీ ఏకం కాకపోతే వైఎస్ జగన్ నేతృత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నుంచి ముప్పు తప్పదని ఆయన మీడియా ప్రతినిధులతో అన్నారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు నర్సోజీరావు కూతురు వివాహ వేడుకల్లో పాల్గొనేందుకు బుధవారం రాత్రి ఆయన హిందూపురానికి వచ్చారు. కాంగ్రెస్ పార్టీలో గ్రూపులు, విభేదాలు సహజమని, ఎప్పుడై నా ఒకతాటిపైకి రాక తప్పదన్నారు. అందుకోసం తన వంతు కృషి చేస్తానన్నారు.