త్రివేండ్రం అనంత పద్మనాభస్వామి ఆలయంలో అగ్నిప్రమాదం
Published on: Sun Feb 26, 2017 11:29AM

కేరళ రాజధాని తిరువనంతపురంలోని ప్రపంచ ప్రఖ్యాత అనంత పద్మనాభస్వామి ఆలయంలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఆలయ గోదాములో మంటలు చెలరేగి పక్కనే ఉన్న తపాలా కార్యాలయానికి అంటుకున్నాయి. ఈ ప్రమాదంలో గోదాము, తపాలా కార్యాలయం రెండు పూర్తిగా దగ్ధమవ్వగా..ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగివుండవచ్చని భావిస్తున్నారు. ఆస్తినష్టం వివరాలు తెలియాల్సి ఉంది.


