ప్రలోభాలకు లొంగబోమని రామయ్యకాలనీ వాసుల ప్రమాణం
Published on: Tue Jun 12, 2012 10:46AM
ఎన్నికల్లో అభ్యర్థులు చేసే ప్రలోభాలకు తాము లొంగబోమని అనంతపురం అర్బన్ నియోజకవర్గం పరిథిలోని రామయ్యకాలనీ వాసులు ప్రమాణం చేశారు. కాలనీవాసులందరూ ఏకతాటిపై నిలబడి మరీ ఈ ప్రమాణం చేశారు. తమకు నచ్చిన వారికి ఓటేస్తామని వారు ప్రకటించారు. ఓటు హక్కు మన జన్మహక్కు అని ఓటర్లందరూ గుర్తించాలని కాలనీవాసులు ప్రచారం కూడా చేస్తున్నారు. నేతలు ఎన్నికల్లో చేసే హామీలను నమ్మకుండా ఓటర్లందరూ ఇప్పటివరకూ తమకు ఎవరు కలిసొస్తే వారికే ఓటేయాలని సూచిస్తున్నారు. నిజాయితీతో చేసే ఓటు అభివృధికి పునాది వంటిదని కాలనీవాసులు అభిప్రాయపడ్డారు. ఐదేళ్ళపాటు సేవలందించే నేతలకు ప్రాధాన్యత ఇవ్వాలని కాలనీవాసులు ఓటర్లకు విజ్ఞప్తి చేస్తున్నారు.


