TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

బచ్చా లాంటి శైలజానాథ్ క్రింద నేనెట్లా పనిజేస్తా ...

Published on: Thu Apr 12, 2012 12:10PM

ఉప ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అనంతపురం జిల్లా కాంగ్రెస్ పార్టీలోని అంతర్గత విభేదాలు పార్టీ అధిష్టానానికి తలనొప్పిగా మారాయి. ఈ వర్గవిబేధాలను అరికట్టడానికి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు బొత్సా సత్యనారాయణ ప్రయత్నించినప్పటికీ పెద్దగా ఫలితం కనిపించటం లేదు. అనంతపురం, రాయదుర్గం అసెంబ్లీ ఉప ఎన్నికలకు పార్టీ ఏర్పాటు చేసిన సమన్వయ కమిటీ సబ్యుల్లో ఏమాత్రం సమన్వయము కనిపించటం లేదు. వీరిలో వీరే కీచులాడుకుంటూ పార్తీపరువును బజారున పడేస్తున్నారు. అనంతపురం ఉప ఎన్నిక వ్యవహారాల ఇన్ ఛార్జిగా మంత్రి శైలజానాథ్ ను నియమించటం పట్ల ఎమ్మెల్యే జె.సి,దివాకర్ రెడ్డి తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.

 

తన రాజకీయ అనుభవంతో పోలిస్తే మంత్రి శైలజానాథ్ బచ్చాలాంటివాడని, అతన్ని ఇన్ ఛార్జిగా నియమించి తనను సమన్వయకమిటీ సభ్యునిగా నియమించటం ఎంతవరకూ సమజసమని జెసి దివాకర్ రెడ్డి వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి తోడు తమ వర్గీయుడైన కోఘటం విజయభాస్కరరెడ్డికి టిక్కెట్టు ఇప్పించుకోవతంలో జెసి విఫలమయ్యారు. విజయభాస్కరరెడ్డికి టిక్కెట్టు రాకుండా మంత్రులు రఘువీరా, శైలజానాథ్ లు అడ్డుతగిలారని జెసి బహిరంగంగానే ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో నాయకుల మధ్య సమన్వయము లేకపోవటంతో ఆ పార్టీ తరపున రంగంలో ఉన్న అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు.