TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

సిఎం రోడ్‌షోలో బస్సుపై నుంచి పడిపోయిన ఎమ్మెల్యే

Published on: Fri May 18, 2012 9:53AM

అనంతపురం వేదికగా సీఎం కిరణ్‌ కుమార్‌ రెడ్డి వాహనంపై నుంచి గుంతకల్ శాసనసభ్యుడు, డిసిసి అధ్యక్షుడు మధుసూదన్ గుప్తా జారి కిందపడిపోయారు. పాతూరులోని తాడిపత్రి బస్టాండ్ సర్కిల్‌లో ఎంపీ అనంత వెంకటరామిరెడ్డితో కలిసి గుప్తా ప్రచారంలో పాల్గొన్నారు. ఈ క్రమంలో ప్రచార రథం టాప్ నుంచి ఆయన కిందపడిపోయారు. రక్తస్రావమై ఆ వెంటనే అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది, కార్యకర్తలు హుటాహుటిన అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి తరలించారు. వైద్యుల సలహా మేరకు మంత్రులు రఘువీరారెడ్డి, శైలజనాథ్ ఆయనను బెంగళూరుకు తరలించారు. మధుసూదన్ గుప్తా చేయి విరిగినట్లు సమాచారం. తలకు కూడా గాయమైంది.