TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

అనంత అభివృద్ధికి ఉప ఎన్నికల గండం?

Published on: Tue Jun 5, 2012 10:11AM

అనంతపురం జిల్లా అభివృద్ధిని ఉప ఎన్నికలు దెబ్బతీస్తున్నాయి. మంత్రులూ, నేతలూ ఉప ఎన్నికల ప్రచారంలో తలమునకలవటంతో ఇక్కడ నిధులు వినియోగానికి నోచుకోవడం లేదు. 2011-12లో రూ.31.89కోట్లు నిధులను అభివృద్ధి కోసం విడుదల చేస్తే దానికి ప్రతిపాదనలు రూపొందించలేదు. అలానే ఎన్ డి ఎఫ్ కింద నిధుల కేటాయిస్తే మొత్తం 12ఉత్తర్వుల ప్రకారం రూ. 31.39 కోట్లు మంత్రి శైలజానాధ్ మంజూరు చేశారు. ఆ నిధుల్లో శింగనమల నియోజకవర్గంలోని ఆరుమండలాలకు ఆరు కోట్ల రూపాయలు మంజూరు చేశారు. వీటికి కూడా ఈ పనులు చేయాలన్న ప్రతిపాదనలు రూపొందించలేదు. ఉప ఎన్నికలు పూర్తయ్యేంత వరకూ జిల్లా అభివృద్ధి ఇలా దెబ్బతింటోందని అనంతపురం వాసులు గగ్గోలు పడుతున్నారు. మంత్రి కూడా రోడ్లు, డ్రైన్లు వంటి పలు సమస్యలుంటే ఒక్క ప్రతిపాదన కూడా రూపొందించకపోవటం వల్లే తమ అభివృద్ధి కుంటుపడుతోందని వారు వాపోతున్నారు. ఈ గండం ఈ నెల 12తో ముగిస్తే చాలని వారు ఎదురుచూస్తున్నారు.