రెచ్చిపోయిన ఉగ్రవాదులు.. మంత్రి ఇంటిపై దాడులు
Published on: Mon Mar 27, 2017 10:42AM
.jpg)
జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. ఈసారి ఏకంగా మంత్రి ఇంటిపైనే దాడికి పాల్పడ్డారు. వివరాల ప్రకారం...జమ్మూకశ్మీర్‌లోని అనంతనాగ్ జిల్లాలో మంత్రి ఫరూక్ అంద్రాబి ఇంటిపై ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. దీంతో వెంటనే అప్రమత్తమైన సిబ్బంది వారిపై ఎదురుకాల్పులు జరిపారు. ఈ ఘటనలో భద్రతా సిబ్బంది ఇద్దరికి గాయాలయ్యాయి. గాయపడిన భద్రతా సిబ్బందిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా దాడి జరిగిన సమయంలో ఫరూక్ ఆ ఇంట్లో లేకపోవడంతో పెనుప్రమాదం తప్పింది.


