TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

మందు పంపిణికి సహకరించని సర్కార్! ఆనందయ్య కన్నీళ్లు..  

Published on: Sat Jun 5, 2021 2:43PM

హైకోర్టు అనుమతి ఇచ్చింది... ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ చెప్పేసింది.. ఇంకేం కృష్ణపట్నం ఆనందయ్య మందుకు అన్ని అడ్డంకులు తొలగిపోయాయి. దీంతో లక్షలాది మంది కోరుకుంటున్న మందు పంపిణి మళ్లీ మొదలవుతుందని అంతా భావించారు. ఎప్పుడెప్పుడా అని అశగా ఎదురుచూస్తున్నారు. మూడు రోజుల క్రితం కృష్ణపట్నం పోర్టులో మందు పంపిణి ప్రారంభమైందని, సోమవారం నుంచి పంపణి చేయనున్నారని వార్తలు వచ్చాయి. ఆన్ లైన్ లో మందు పంపిణికి ఏర్పాట్లు చేసినట్లు నెల్లూరు జిల్లా కలెక్టర్ నుంచి ప్రకటన వచ్చింది. ఈ ఔష‌ధానికి ‘ఔషధచక్ర’ అని పేరు పెట్టిన‌ట్లు స‌మాచారం. 

అంతా సాఫీగా జరుగుతుందనుకుంటున్న సమయంలో సీన్ మొత్తం మారిపోయినట్లు కనిపిస్తోంది. సోమవారం నుంచి ఆనందయ్య మందు పంపిణి కష్టమేనని తెలుస్తోంది. ఏపీ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే మందు పంపిణికి సమస్యలు వస్తున్నాయని ఆనందయ్య అనచురులు, కృష్ణపట్నం గ్రామస్తులు చెబుతున్నారు. 

ఆనందయ్య మందు పంపిణీకి ప్రభుత్వ సహకారం లేదని... మందు పంపిణీ జరగదని.. దయచేసి ఎవరూ కృష్ణపట్నం రావొద్దని ఆనందయ్య సన్నిహితుడు సంపత్ రాజు తెలిపారు. కృష్ణపట్నంలో 144 సెక్షన్ అమలు చేస్తున్నారన్నారు. ఆనందయ్య రోజుకి అయిదు వేల మందికి సరిపడే మందు మాత్రమే తయారు చేయగలరన్నారు. ప్రభుత్వం జిల్లాల వారీగా లక్షల మందికి పంపిణీ చేయమనడం సరికాదన్నారు. ప్రాణాపాయ స్థితిలో వచ్చేవారికి మందు ఇవ్వలేక, ఆనందయ్య కన్నీళ్లు పెట్టుకుంటున్నారన్నారు‌. ప్రభుత్వం సహాకారం అందిస్తేనే మందు పంపిణీ సాధ్యమన్నారు. ఆన్ లైన్‌లో మందు ఇవ్వలేమని సంపత్ రాజు వెల్లడించారు.ఈ మేరక ఆయన విడుదల చేసిన వీడియో వైరల్ గా మారింది.