వట్టిపోయిన పెన్నానది, గొంతెండుతున్న పల్లెలు
Published on: Fri Feb 24, 2012 12:53PM
అనం
తపురం: అనంతపురం జిల్లా వాసులకు తాగునీరు అందించే పెన్నా నది వట్టిపోయింది. ప్రతిసారి వేసవిలో ఆదుకునే పెన్నా ఈసారి ఎడారిగా మారింది. భూగర్భజలమట్టం కనిష్టస్థాయికి పడిపోయింది. నది ద్వారా బోర్లతో అందించే నీటి పథకాలకు నీరు దొరకడం లేదు. ఇప్పటికే గ్రామాల్లో దాహంతో అలమటిస్తున్నారు. ఐదేళ్ళుగా తీవ్ర వర్షాభావ పరిస్థితులతో నదిలో నీటి ప్రవాహం లేక భూగర్భ జలం పూర్తిగా పడిపోయింది. వివిధ గ్రామాలకు నీరు అందించడానికి ఏర్పాటుచేసిన సుమారు వెయ్యి బోర్లలో సగానికి పైగా ఇప్పటికే వట్టిపోయాయి. దీంతో కొన్ని బోర్ల లోతు పెంచుతున్నారు. అయినా పెద్దగా ఫలితం కనిపించడం లేదు. గార్లదిన్నె, పామిడి, పెద్దవడుగూరు, సింగనమల, పెద్ద వక్కూరు, తాడిపత్రి, యాడికి మండలాల్లో పెన్నానది పరివాహక ప్రాంతాల్లో నదిలో వేసిన బోర్లతోనే సగం గ్రామాలకు నీరు సరఫరా చేస్తున్నారు. నిరంతరం నీరు సరఫరా చేసే సత్యసాయి సమగ్ర రక్షిత మంచినీటి సరఫరా పథకాలు కూడా ఈ బోర్లతోనే పనిచేస్తున్నాయి. అయితే పెన్నానదిలో నీరు ఇంకి పోవడంతో ఈ వేసవిలో ఈ బోర్లన్నీ నిరుపయోగంగా ఉండిపోయే ప్రమాదం ఉంది.


