అధికారుల బదిలీకి నేతల సిఫార్సులు
Published on: Mon Mar 12, 2012 1:32PM
అనం
తపురం: అనంతపురం, రాయదుర్గం ఉపఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలనే ఉద్దేశంతో ఉన్న అధికార కాంగ్రెస్ పార్టీ ఈ రెండు నియోజకవర్గాల పరిధిలో అధికారుల తీరు తెన్నులను పరిశీలిస్తోంది. ఇక్కడి రెవెనన్యూ. పోలీస్ అధికారులలో తమ మాట వినని వారిని నోటిఫికేషన్ విడుదలకు ముందే బదిలీ చేయించడానికి జిల్లాకు చెందిన మంత్రులు ప్రజాప్రతినిధులు రంగం సిద్దం చేస్తున్నారు. ఇదే సమయంలో తమ అడుగులకు మడుగులొత్తే అధికారులకు ఈ ప్రాంతానికి తెచ్చుకోవడానికి హైదరాబాద్ స్థాయిలో లాబీ చేస్తున్నారు. అనంతపురం ఆర్డీఓ గౌతమిరెడ్డి , ధర్మవరం ఆర్డీఓ ప్రభాకర్ పిళ్ళై కి త్వరలో బదిలీలు రావచ్చంటూ ఊహ గానాలు వస్తున్నాయి . అనంతపురం ఆర్డీఓ గౌతమిరెడ్డి వీధి నిర్వహణలో ముక్కుసూటిగా ఉండే వ్యక్తి, ఎన్నికల సమయంలో ఇదే రీతిగా వ్యవహరిస్తే తమకు ఇబ్బంది కలుగుతుందనే భయంతో జిల్లాకు చెందిన మంత్రి ఒకరు ఈ అధికారిపై టార్గెట్ పెట్టారు. ధర్మవరం ఆర్డీవో ప్రభాకర్ పిళ్ళై అధికార పార్టీ నేతలకు అనుకూలంగానే పనిచేస్తారు. అయితే ఆయనకు త్వరలో బదిలీ వచ్చే అవకాశం వుంది. అందువల్ల ఆయన స్థానంలో తమకు ఉపయోగపడే మరో అధికారిని నియమించుకోవడానికి కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు ప్రయత్నిస్తున్నారు. తమ అడుగులకు మడుగులొత్తే అధికారులను అనంతపురం, రాయదుర్గం నియోజకవర్గాల్లో కీలక స్థానాల్లో కూర్చోబెట్టాలని అధికారి పార్టీ నాయకులు భావిస్తున్నారు.


