TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

అనంత వెంకటరామిరెడ్డికి రూ.5 కోట్ల గాలి నిధులు

Published on: Sat Mar 10, 2012 1:24PM

అనంతపురం:    అనంతపురం పార్లమెంట్ సభ్యుడు అనంత వెంకటరామిరెడ్డికి ఓబుళాపురం మైన్స్ అధినేత, మైనింగ్ మాఫియా డాన్ అయిన గాలి జనార్ధనరెడ్డి రూ.5 కోట్లు ఇనాంగా ఇచ్చినట్లు తెలిసింది. ఈ మొత్తం ఆయన రెండేళ్ళక్రితం వెంకటరామిరెడ్డికి ఇచ్చినట్లు ఆయన ప్రత్యర్ధులు ఆరోపిస్తున్నారు. అయితే ఈ ప్రత్యర్ధులు ఏ టిడిపివారో లేదా బిజెపి నాయకులో కాదు. స్వయాన కాంగ్రెస్ పార్టీ నాయకులే. అనంత వెంకటరామిరెడ్డి రూ.5 కోట్లు తీసుకున్నట్లు తమ వద్ద ఆధారాలున్నాయని సిబిఐ అడిగితే ఆ ఆధారాలు చూపిస్తామని జిల్లాకు చెందిన నాయకులు కె. విజయభాస్కరరెడ్డి, మల్లిఖార్జునరావు, రషీద్ అహ్మద్, రాజశేఖరరెడ్డి తదితరులు అంటున్నారు. గాలి జనార్దనరెడ్డితో చేతులు కలిసి ఆయన ప్రయోజనాలను కాపాడటానికి ప్రయత్నించిన అనంత వెంకటరామిరెడ్డి జిల్లాలో పార్టీ పరువు మంతగాలిపారని ఈ విషయం పార్టీ అధిష్టానం గమనించి ఆయనపై చర్యలు తీసుకోవాలని ఈ నాయకులు డిమాండ్ చేస్తున్నారు.